Pages

Journalist Journy..A Journey for truth

జర్నలిష్టుగా నా జర్ని(ప్రయాణం) లో జరిగిన విషేషాలు...కష్టాలుకావచ్చు నష్టాలు కావచ్చు...జర్నలిష్టుగా నా అనుబవాలే కాక...నేను చేసిన ష్టోరీల వెనుకవున్న...వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేస్తనుతప్పులుంటే మన్నించండి స్నేహితులుగా సలహాలుఇవ్వండి..కొత్తగా మీడియాలోకి వచ్చేవారికి నా ఈ బ్లాగ్ సహాయపడుతుందని ఆసిస్తాను

click this

Saturday, April 24, 2010

అమ్మ కోసం ఓ చిన్నారి ఆవేదన ...మీరు సహాయం చేయగలరా

ఇది ఓ చిన్నారి కన్నీటి గాధ..పట్టు మని పదిహే సంత్సరాలు లేని ఈ చిన్నారి పేరు స్వప్న...ఎనిమిది సంత్సరాల క్రీతం అమ్మకొట్టిందని ఇల్లు వదలింది...ఇంటిదగ్గరలో ఓ రైల్వెష్టేషన్ దగ్గరలో కూరగాయల మార్కెట్ అనిమాత్రమే చెప్పగలదాచిన్నారి....ఆమ్మపేరు పద్మ చెల్లి,తమ్ముడు ఉన్నట్టు మాత్రమే గుర్తు...అలా తెల్సి తెలియని వయస్సులో కేరళలోని డాన్ బొస్కొ అనాద ఆశ్రమానికి చేరింది....తప్పి పోయినప్పుడు స్వప్న వయస్సు ఆరు సంత్సరాలు..ఇప్పుడు 14 సంత్సరాలు తల్లిని చుడాలని ఆచిన్నారి స్వప్న మనస్సు కోరుకుంటోంది....డాన్ బోస్కొ స్కూల్ కేరళ్ వారు హైదరాబాద్ లోని వారికి ఈవిషయాన్ని తెలిపి సహాయం చేయాలని కోరింది ఈవిషయం జీ 24 గంటలకు తెలవడంతో ఎలాగైనా తల్లీకూతుర్లను కలపాలని ఒ భారీ ప్రయత్నాన్ని ప్రారంబించింది..స్వప్న తెలిపిన వివరాలతో నగరంలొ అప్పటి ,ఇప్పటి ఫోటోను తీసుకోని నగరంలో స్వప్న చెప్పిన వివరాలు తెల్సుకునేప్రయత్నం చేసింది.. జీ 24 గంటలు..ఇ ఆపరేషన్ లొ 25 మంది రిపొర్టర్లు పనిచేసారు...నగరంలో మూడుకీలక ప్రాంతాలనుంచి లైవ్ ఇస్తూ మూడుగంటలు స్వప్న అమ్మకోసం వెరికే ప్రయత్నంచేసింది జీ 24 గంటలు ...మరి ఆవిషేషాలు తాలూక వీడియో చూడండి..A STORY BEHIND THE WORK

ఆరోజు రెండోషిఫ్ట్ వచ్చాను...పేపర్ చదువుతున్నాను...మా ఇన్ చార్జ్ కోఅర్దినేటర్...వెంకట రెడ్డి గారు వచ్చి నా ప్రక్కనే కూర్చున్న....నా చిరకాల్ మిత్రుడు గోపరాజు ను ఓస్టోరీ చేయాలని అడుగుతున్నారు..అప్పటికే వేరే ష్టోరీలో బిజీగావున్నాడు మా మిత్రుడు గోపరాజు....ఈ లోగా మా క్రైం ఇన్ చార్జి గౌస్ గారువచ్చి ఇన్నారెడ్డి నీవు చేయాలీ ఈ ష్టోరి అని అన్నారు...అప్పటికి స్వప్న కు తెలుగురాదని మళయాలం మాత్రమే..తెల్సు అనడంతో లాగ్వేజ్ ప్రాబ్లం అని చెప్పాను గౌస్ సార్ కి...అక్కడ నీకు విషయాన్ని వివరించడానికి ట్రాన్స్ లేటర్ వుంటారు అని నీవే ఈ ష్టోరీచేయాలి అనిచెప్పరు...వెంటనే కెమేరా యూనిట్ తీసుకొని డాన్ బొస్కొ కు వెల్లాను అప్పటికే అక్కడ మాలోకల్ రిపొర్టర్ శ్రీధర్ ఉన్నాడు అక్కడే స్వప్న,డాన్ బోస్కో డైరెక్టర్ బాలసౌరిగారు ,బ్రదర్,ఓ శిష్టర్ ఉన్నారు...అప్పటికే స్వప్న అమ్మకోసం ఏడుస్తూ వుంది...కావాల్సిన విషయాలు సెకరించి....ఫాదర్ బాలశౌరి అనుమతితో హైదరాబాద్ లో స్వప్న చెప్పినవివరల ప్రకారం...అన్నీ ప్రాంతలు జీ24గంటాలు సహాయంతో వెతకాలని నిర్నయించుకొని అఫీసుకు వచ్చి అన్ని విషయాలు మా ఇన్ చార్జ్ గౌసుద్దీన్ గారికి చెప్పాను నీకు వేరే ష్టొరి వుండదు అని స్వప్నకు ఏవిదంగా సహాయంచేయగలమో చేయమని మరింత సహకారంకావాలంటే వెంకటరెడ్డి సహాయం తీసుకోమని చెప్పారు...వారి చెప్పిన ప్రకారం..మరుసటిరోజు..స్వప్ననుతీసుకోని స్వప్న కు గతంలో ఎమైనా తిరిగిన ప్రదేశాలు " సికింద్రాబాద్ రైల్వే ష్టేషన్ " మొంజామార్కేట్,ఖైరతాబాద్ ప్రాంతాలు తిరిగాను....కాని ఎక్కడా కుడా తనకు తెల్నిన ప్రాంతాన్ని గుర్తించలేదు....దీంతో విషయాన్ని మా బాస్ గౌస్ సార్ కు విషయం చెప్పగా మా చానల్ లో హెడ్స అందరూ కల్సి కూర్వొని స్వప్న తల్లిని వెతికే విషయంలో తప్పకుండా సహాయంచేయాలని నిర్నయించుకోని ఓ యాక్షన్ ప్లాన్ తయారు చేశారు.....మరుసటిరోజు మాచానల్ లో 10 మంది రిపోర్టర్లు సిటీలొ స్వప్న ఫోటోను చిన్నప్పటిది ఇప్పటిది చూపిస్తూ ఎవ్వరైనా గుర్తిస్తారేమోనని ఓ భారీ ప్రయత్నాన్ని చేశారు...సాయంత్రం నాలుగు గంటలనుంచి మూడుప్రాంతాల్లోనుంచి లైవ్ ఫ్రోగ్రాం ....ఆసమయంలో స్వప్నను ష్టూడియో లో కూర్చోబెట్టి ఎవ్వరైనా స్వప్నను గుర్తిస్తారేమో నని ఇంతవరకు ఏ న్యూస్ చానల్ చేయని గోప్ప ప్రయత్నం మా జీ24 గంటలు చేసింది...లైప్రొగ్రాం సమయంలో అందరూ మేము చేస్తున్న ప్రయత్నాన్ని అభీనందించారు...అప్పుడు స్వప్నతల్లి ఆచూకి దోరకలేదుకాని చాలామంది స్వప్న తన బిడ్డేమొనని వచ్చీ చూసి వేళ్ళారు.... ఈ నేపద్యంలోనే..రంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ కుటుంబం చెప్పిన ఆనవాళ్ళు పుట్టు మచ్చలు ఆన్నీస్వప్నకు సరిపోయాయి..... వాళ్ళే స్వప్న తల్లిదండ్రులని అనుకుంటున్నాము కాని డిఎన్ ఏ టెష్టు రిపొర్టు రావలసి వుంది...అది వస్తే ఓ తల్లిబిడ్డను కలిపిన ఆనందం మా జీ 24 గంటలు టీం కు మిగులుతుంది

Wednesday, April 21, 2010

జర్నలిష్టుగా నా అనుభవాలు...its రియల్ (పార్ట్ -3)

ఎముంది షరామామూలే ఏడ్వటైజ్ మెంట్స్ తీసుకొనిరావడం వాటితాలూకా చెక్కులురాగానే మానేయమనటం ఎందుకంటే ఆడబ్బులలో కమీషన్ ఇవ్వవలసి వస్తందనీల్..అలా నేనుఆపత్రికలోరాసిన ఐటం చూసిన మా కజిన్ బ్రదర్ సుధాకర్ రెడ్డి డక్కన్ క్రానికల్ సీనియర్ క్రైం రిపొర్టర్ నేను ఇలమీడియాలో ఉన్నట్టు తెలియదు...ఆ పత్రికలో నపేరు చూసి ఫోన్ చేసి అప్పటి టి.వి9 క్రైం ఇన్ చార్జ్ క్రాంతి కిరణ్ కు పరిచయంచేసాడు క్రాంతి సార్ నాకు రిపొర్టర్ గా అవకాశం ఇవ్వాలని చూసినా కరీం ఇంటర్వూచేసి వద్దనటంతో...క్రైం బీట్ లో మంచి అనుబవంరావలంటే లోకల్ రిపొర్టర్ గాపనిచేస్తే మంచిదని క్రాంతిసార్ సలహాఇచ్చి మెహిదిపట్నం లోకల్ రిపోర్ట్ర్ గా టి.వి9 లో పనిచేసె అవకాశం ఇచ్చారు క్రాంతిసర్ ...(ఆతరువాత ఏమైందో..వచ్చెసంచికలో వివరిస్థాను..)

Monday, April 19, 2010

జర్నలిష్టుగా నా అనుభవాలు...its రియల్ (పార్ట్ -2)

హైదరాబాద్ వచ్చినతరువాత మీడియాలో అనుభవం కోసం ప్రింట్ మీడియాలో పని చేద్దాం అని నిర్నయించుకున్నాను డైలీ పేపర్ లో ప్రయత్నించాను అప్పటికప్పుడు మనల్ని అవకాసాలు వెతుక్కుంటూ రావు కదా ? అలాప్రయత్నం చేస్తుంటే ..ప్రతిగ్న అని లోకల్ పేపర్లో ఏడ్ చూసి వెల్లాను..వాల్లు రిపోర్టింకంటే ప్రకటనలు ఇస్తే..వార్తలు వేస్తాం అన్నారు ..కాని ప్రకటనలు తీసుక రాలేక పోయాను..ఎందుకంటే..అపత్రిక వున్నసంగతి నాకు మా ఏడిటర్ కి తప్ప వేవరికి తెలియదు.....అలా కొన్నాల్లు పని చేసాను..కాని అర్దిక కారణాలవల్ల పేపర్ రావడంలేదు..అతరువాత మరో పత్రికలో రిపొర్టర్ కావలంటూ ప్రకటన వారూ కూడా ప్రకటనలు తెస్తేనే వార్తలు వేస్త్తామన్నారు అక్కడా పనిచేయలేకపోయాను..కారనం ....కలానికి పని చెబుదాం అని అనుకుంటే..నన్ను ఓ ఎడ్వటైజింగ్ మార్కటింగ్ ఎగ్జిక్యూటివ్ గానే వారు నన్నుప్రోత్సహిస్తుంటే..కష్టమైనా..ఇష్టంలేకపోవడంతో..మత్లీ మేగజైలో పనిచేద్దం అని అన్నీ మేగజై నులు కొని అప్లైచేశాను..క్లూటుడే అని ఓ మంత్లీ మేగజైను లో మాత్రం రిపొర్సు రాయమన్నారు ఎడిటర్... శాలరీ మాత్రం ఇవ్వలేము అని తేల్చి చెప్పారు...సరేఅని..మంచి ...స్టొరీస్ వ్రాయడం చూసి కర్చులకి డబ్బులు ఇచ్చేవారు..అలా పని చేస్తుండగా..పత్రికలో ప్రకటనచూసాను" సత్య" న్యూస్ చానల్ ప్రారంబిస్తున్నారు అని అప్లి చేసుకుటే వచ్చి జాయిన్ అవ్వమన్నారు..అప్పటికి టివి9 ప్రారంబంకాలేదు ....టివ్9 కన్నాముదే రావాల్సింది మా చానల్..ఆలా ఆ చానల్ లో సంవత్సరం పని చేసాను..ఎండిగారు బాగాప్రోత్సహిచారు..అప్పటిలొ మంచిస్టోరీలు చేసాను..ఎలక్టానిక్ మీడియాలో మంచిగా ట్రైనిం ఈచ్చారు ..సత్య టివి లో..అలా సంత్సరం సత్యిటివి లో పని చేసిన తరువాత...రెండునెలలు..ఖాలీగ వుండవలసివచ్చింది...ఈ లోగా ..పేపర్లొ..ఓ ప్రకటనను చూశాను..రిపొర్టర్సుకాకాలి అని...ఆ మేగజైన్ పేరు అప్పటిలొ క్రైంరిపొర్టర్...ఆపత్రిక ఏడిటర్ మనసులు కదిలించేలా రాయగలడుకాని..మనస్సులేని మనిషి...అతనికి కావలసింది డబ్బు...తన పత్రికలొ...7 గురిచే పత్రిక లొ చేర్పించిన వారికి రిపోర్టర్ ఐడికార్డు ఇ స్తాను అని కండీషన్ పే ట్టెవాడు మంచి ఆర్టికల్స్ర్ రాస్తాను అంటే లేదు ప్రకటనలు తీసుకరండి...జనాలని ఏలాబెదిరించి ప్రకటనలుతీసుకరావాలొ..చేప్పెవాడు....నేను ఏవ్వర్ని అలా బెదిరించలేదుకాని....ఏదొరకంగా ప్రకట్నలు తీసుకవచ్చేవాడినిఎందుకంటే ప్రకటనలుతీసుకవస్తేనె..నెనురాసిన ఆర్టికల్స్..పత్రికలొవచ్చేవి....అందుకని...కాని క్రైంరిపోర్టర్ టైటిల్ కు పర్మిషన్ రాలేదు దానితో..క్రైం టుడే గా ఆ పత్రిక నడిచేది..ప్రకటనలు ఇచ్చినతరువాత...డబ్బులు రాగానె నాకు కమీషన్ డబ్బులు ఇవ్వవలసి వస్తుందని...జాబ్ మానివేయమని గొడవ పేట్టుకొనేవాడు...మరలా..పిలిచేవాడు..అలా ఆపత్రికలొ మనసు చంపుకొని పని చేశానుకాని నేనురాయదలచుకున్నాఆర్టికల్స్ రాసేవాడిని..కాని కొన్నిమాత్రం పబ్లిష్ అయ్యేవి..కొన్నిటికి పేర్లు నావి వుండేవికావుఎందుకు అంటే అది అంతే...అలా..పత్రికలో...ప్రత్యెక ప్రతినిధిగా...చీఫ్ రిపోర్టర్ గా పనిచేశాను అలా అక్కడ సొంత డబ్బులు ఖర్చుపేట్టుకొని...సంత్సరంపనిచేశాను (ఆతరువాత ఏమైందో..వచ్చెసంచికలో వివరిస్థాను..)

జర్నలిష్టుగా నా అనుభవాలు...its రియల్ (పార్ట్ -1)

జర్నలిష్టగా నాజర్నిలో...ఎదురైన అనుభవాలు..కొత్తగా ఈ ఫీల్డ్ కు వచ్చేవారికి వుపయోగపడతాయని..బ్లాగ్ ప్రారంబిస్తున్నాను....జర్నలిష్టగా నా అనుభవాలను..ఇందులో పోందుపరుస్త్తాను...సీనియర్ జర్నలిష్టులుకూడా పాల్గోటారని ..జర్నలిష్ట్ గామీ అనుభవాలను తేలియజేస్తారని తలస్తాను...అసలు మీరు ఎలాజర్నలిష్టుగా మారారు..అప్పుదుమీకుఎదురైన అనుభవాలు ..ఎదురైన సంగటనలు..

జీవితం లో ఎదురైయ్యెఘటనలు అన్నీ మనకుపాఠాలే...అన్నిటికి అమ్మో అని బయపడితే జీవితంలో గెలవలేము....దారిన పోతుంటే రోడ్డు అంతా మచిగాచిగా వుండాలనే రూల్ లేదు...సిమెంట్ రోడ్డు..గతుకులరోడ్డు..మట్టిరోడ్డు కూడావుంటుంది...అలాగని ప్రయానంచేయడం మానివేయంకదా...ఇదే జీవితానికి ఉదాహరణ ఎలగైనా గమ్యిస్తానానికి చేరాలని కోరుకుంటాం..తెల్సి తెలియని వయస్సులో బిజినెస్ పెట్టాను....లాస్ అయ్యాను...అప్పటికే నేను ఓ ప్రముఖ పత్రికలో స్తానిక రిపొర్టర్ గా పని చేసిన అనుబవంవుంది ...బిజినెస్ లో బాగా లాస్ అయిన నేను అర్దికంగ తీవ్రంగా దెబ్బతిని హైదరాబాద్ చేరుకున్నాను ...ఆలా తీవ్ర అర్దిక ఇబ్బందుల్లో వున్ననేను...జర్నలిష్ట్ గా నాపాత్ర పోషించలేక పోయాను గుంటూరులో నేను ఇవ్వాల్సినవారికి డబూలు ఇచ్చి.నాకురావాల్సినడబ్బులు వదులికొని..అలా..హైదరాబాద్ చేరాను...వుద్యోగప్రయత్నాలు మెదలు పెట్టను..కాని..ఎక్కడ వుద్యొగందొరకని పరిస్తితి..అయినా మనం చేసింది..డిగ్రీ..కదా ..ఎక్కడావుద్యోగం దొరకలేదు..ఇటువంటి సమయంలో..నా అకున్న వారెవరూ..కనీసంకూడ..పలుకరించని పరిస్తితి...కనిపిస్తే ఎక్కడ డబ్బులు అడుగుతానొ అని..కనీసం పలుకరించని పరిస్తితి ...అప్పటికే నాకు కంప్యూటర్ హార్డ్వర్ లో అనుబవం వుడటంతో...మెహిదిపట్నంలోని ఇంటర్నెట్ సెంటర్లో ...హార్డ్వేర్ ఇంజనీర్ గా 2000/- సేలరీతో హైదరాబాద్..లొ కొత్తజీవితంప్రారంబిచాను అలా జాబ్ చేస్తున్నా..చిన్నయింట్లో..ఇరుకుకావురం కస్టాలు మెదలు ఏదో వెలితి.. చాలిచాలని జీతం దీనితో ...మరొ క వ్యాపకం చెయ్యకపోతే..ఫ్యామిలి గడవటం కస్టం..కాని ఎదిచెయ్యాలన్నా పెట్టుబదికి ..డబ్బులు కావాలి...సొంత అన్నలను అడిగితే ఘోర పరాబవం ...అలానీటిలో నావలా..గమ్యింతెలియమి నావలా..జీవితం సాగుతున్న తరునం ళొ...దేవుడు కొందరిని..పంపి..ఓ చిన్నాహష్టల్ పెట్టుకున్న దైర్యం ఇచ్చారు కాని కాని అక్కడా..విదివెక్కిరించింది..హాష్టల్ లో పిల్లలు లేక..అప్పులు మొదలు అయ్యాయి..అవి పాపం పెరిగినట్లుపెరుగుతున్నాయి...దిక్కూతోచని పరిస్తితి..డబులు ఇచ్చిన బందువుల సూటిపోటి మాటలతో..జీవితంపై విరక్తి..చనిపోదామని కూడానిర్నయించుకున్నా...జీవితంతో పోరాడలేమేమో అని..నిర్నయించుకున్నా అకరిసారిగా ..దేవుడిని కలూద్దాం అని బయలుదేరా..అక్కడ దేవుని గుడిలో..చర్చిలో మామనసుమార్చారు ..చాలమదితో పోలిస్తే మీకష్టాలు ఎంత అన్న ...మాటలు మనసులో నాటుకపోయినాయి..మనగురించేకాక ..జీవితంలో..మరికొందరికి వెలుగుకావలని చర్చ్ ఫాదర్..చెప్పినమాతలతో నిర్నయం మార్చుకుని తిరిగి ఇంటికి వచ్చాం..అనుకోని పరిస్తితుల్లో...మా విషయం తెలిసిన చర్చ్ ఫాదర్.ఆర్దికంగా ఆదుకోవడమేకాక ఇచ్చిన ద్యైర్యింతొ.మల్లి కొత్త జీవితం మోదలు పెట్టాం..హాష్టల్ మల్లీ నడిపాం పర్వాలేదు జీవితం గాడిలో పడింది..అప్పుడే..టీవి మీడియా..అబివ్రుద్ది చెందుతుంది..జమిని టీవిలో..ఎంకౌంటర్..ప్రొగ్రాం..ఆతరువాత..మాటీవీలో..జర్నలిష్ట్ డైరీ...చూసాక నాలో ఏదో అలజడి..మల్లీ మీడియాలోకి రావాలన్న కోరిక బలపడింది .. టీవి మీడియాలో లో..ఓ స్నేహితుని సహాయంతో,,వెల్లాను.. అక్కడ..కీలకపొష్ట్..లోవున్న వర్మగారు..నాలోని ఉత్సుకతను గమనించి..ఏలక్రానిక్ మీడియాలో అనుభవం కోసం ..విజయవాడ పంపగా..అక్కడ నానిజాయితీ..వారికి నచ్చలేదు...వంటచేయడం నేర్పాడు ఓ మహాను భవుడు..కాని ఆమహానుభవుడికి దేవుడు..పెన్ పవర్ ఇచ్చాడు..హ్రుదయం కదిలించే లావ్రాయగలడు కాని..హ్రుదయం లేని మనిషి స్వార్దం..కుంచిత మనస్తత్వం వున్నవాడు...కాని..మీడియాలో అపార అనుభవం వుంది కాని ఏమి లాభం..అవినీతిలో నిండామునిగిన మనిషి. తనవద్ద నేనువుంటే తనబండారం బయటపడుతుందని..నానిజాయితీ..తన సంపాదనకి అడ్డంకి అని ఇంటికి సాగనంపాడు...ఈమాహాను భావుడే..మీడియాలో..మనసులు కదలించే స్టోరీలు చేసాడంటే మీరు నమ్మరు కాని యిది వాస్తవం..అప్పటినుండే..
అలా మల్లా హైదరాబాద్ తిరుగుప్రయానం జరిగింది..(మిగతాది..తరువాత )
 

Sample text

Sample Text

Sample Text