Pages

Journalist Journy..A Journey for truth

జర్నలిష్టుగా నా జర్ని(ప్రయాణం) లో జరిగిన విషేషాలు...కష్టాలుకావచ్చు నష్టాలు కావచ్చు...జర్నలిష్టుగా నా అనుబవాలే కాక...నేను చేసిన ష్టోరీల వెనుకవున్న...వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేస్తనుతప్పులుంటే మన్నించండి స్నేహితులుగా సలహాలుఇవ్వండి..కొత్తగా మీడియాలోకి వచ్చేవారికి నా ఈ బ్లాగ్ సహాయపడుతుందని ఆసిస్తాను

click this

Saturday, April 24, 2010

అమ్మ కోసం ఓ చిన్నారి ఆవేదన ...మీరు సహాయం చేయగలరా

ఇది ఓ చిన్నారి కన్నీటి గాధ..పట్టు మని పదిహే సంత్సరాలు లేని ఈ చిన్నారి పేరు స్వప్న...ఎనిమిది సంత్సరాల క్రీతం అమ్మకొట్టిందని ఇల్లు వదలింది...ఇంటిదగ్గరలో ఓ రైల్వెష్టేషన్ దగ్గరలో కూరగాయల మార్కెట్ అనిమాత్రమే చెప్పగలదాచిన్నారి....ఆమ్మపేరు పద్మ చెల్లి,తమ్ముడు ఉన్నట్టు మాత్రమే గుర్తు...అలా తెల్సి తెలియని వయస్సులో కేరళలోని డాన్ బొస్కొ అనాద ఆశ్రమానికి చేరింది....తప్పి పోయినప్పుడు స్వప్న వయస్సు ఆరు సంత్సరాలు..ఇప్పుడు 14 సంత్సరాలు తల్లిని చుడాలని ఆచిన్నారి స్వప్న మనస్సు కోరుకుంటోంది....డాన్ బోస్కొ స్కూల్ కేరళ్ వారు హైదరాబాద్ లోని వారికి ఈవిషయాన్ని తెలిపి సహాయం చేయాలని కోరింది ఈవిషయం జీ 24 గంటలకు తెలవడంతో ఎలాగైనా తల్లీకూతుర్లను కలపాలని ఒ భారీ ప్రయత్నాన్ని ప్రారంబించింది..స్వప్న తెలిపిన వివరాలతో నగరంలొ అప్పటి ,ఇప్పటి ఫోటోను తీసుకోని నగరంలో స్వప్న చెప్పిన వివరాలు తెల్సుకునేప్రయత్నం చేసింది.. జీ 24 గంటలు..ఇ ఆపరేషన్ లొ 25 మంది రిపొర్టర్లు పనిచేసారు...నగరంలో మూడుకీలక ప్రాంతాలనుంచి లైవ్ ఇస్తూ మూడుగంటలు స్వప్న అమ్మకోసం వెరికే ప్రయత్నంచేసింది జీ 24 గంటలు ...మరి ఆవిషేషాలు తాలూక వీడియో చూడండి..A STORY BEHIND THE WORK

ఆరోజు రెండోషిఫ్ట్ వచ్చాను...పేపర్ చదువుతున్నాను...మా ఇన్ చార్జ్ కోఅర్దినేటర్...వెంకట రెడ్డి గారు వచ్చి నా ప్రక్కనే కూర్చున్న....నా చిరకాల్ మిత్రుడు గోపరాజు ను ఓస్టోరీ చేయాలని అడుగుతున్నారు..అప్పటికే వేరే ష్టోరీలో బిజీగావున్నాడు మా మిత్రుడు గోపరాజు....ఈ లోగా మా క్రైం ఇన్ చార్జి గౌస్ గారువచ్చి ఇన్నారెడ్డి నీవు చేయాలీ ఈ ష్టోరి అని అన్నారు...అప్పటికి స్వప్న కు తెలుగురాదని మళయాలం మాత్రమే..తెల్సు అనడంతో లాగ్వేజ్ ప్రాబ్లం అని చెప్పాను గౌస్ సార్ కి...అక్కడ నీకు విషయాన్ని వివరించడానికి ట్రాన్స్ లేటర్ వుంటారు అని నీవే ఈ ష్టోరీచేయాలి అనిచెప్పరు...వెంటనే కెమేరా యూనిట్ తీసుకొని డాన్ బొస్కొ కు వెల్లాను అప్పటికే అక్కడ మాలోకల్ రిపొర్టర్ శ్రీధర్ ఉన్నాడు అక్కడే స్వప్న,డాన్ బోస్కో డైరెక్టర్ బాలసౌరిగారు ,బ్రదర్,ఓ శిష్టర్ ఉన్నారు...అప్పటికే స్వప్న అమ్మకోసం ఏడుస్తూ వుంది...కావాల్సిన విషయాలు సెకరించి....ఫాదర్ బాలశౌరి అనుమతితో హైదరాబాద్ లో స్వప్న చెప్పినవివరల ప్రకారం...అన్నీ ప్రాంతలు జీ24గంటాలు సహాయంతో వెతకాలని నిర్నయించుకొని అఫీసుకు వచ్చి అన్ని విషయాలు మా ఇన్ చార్జ్ గౌసుద్దీన్ గారికి చెప్పాను నీకు వేరే ష్టొరి వుండదు అని స్వప్నకు ఏవిదంగా సహాయంచేయగలమో చేయమని మరింత సహకారంకావాలంటే వెంకటరెడ్డి సహాయం తీసుకోమని చెప్పారు...వారి చెప్పిన ప్రకారం..మరుసటిరోజు..స్వప్ననుతీసుకోని స్వప్న కు గతంలో ఎమైనా తిరిగిన ప్రదేశాలు " సికింద్రాబాద్ రైల్వే ష్టేషన్ " మొంజామార్కేట్,ఖైరతాబాద్ ప్రాంతాలు తిరిగాను....కాని ఎక్కడా కుడా తనకు తెల్నిన ప్రాంతాన్ని గుర్తించలేదు....దీంతో విషయాన్ని మా బాస్ గౌస్ సార్ కు విషయం చెప్పగా మా చానల్ లో హెడ్స అందరూ కల్సి కూర్వొని స్వప్న తల్లిని వెతికే విషయంలో తప్పకుండా సహాయంచేయాలని నిర్నయించుకోని ఓ యాక్షన్ ప్లాన్ తయారు చేశారు.....మరుసటిరోజు మాచానల్ లో 10 మంది రిపోర్టర్లు సిటీలొ స్వప్న ఫోటోను చిన్నప్పటిది ఇప్పటిది చూపిస్తూ ఎవ్వరైనా గుర్తిస్తారేమోనని ఓ భారీ ప్రయత్నాన్ని చేశారు...సాయంత్రం నాలుగు గంటలనుంచి మూడుప్రాంతాల్లోనుంచి లైవ్ ఫ్రోగ్రాం ....ఆసమయంలో స్వప్నను ష్టూడియో లో కూర్చోబెట్టి ఎవ్వరైనా స్వప్నను గుర్తిస్తారేమో నని ఇంతవరకు ఏ న్యూస్ చానల్ చేయని గోప్ప ప్రయత్నం మా జీ24 గంటలు చేసింది...లైప్రొగ్రాం సమయంలో అందరూ మేము చేస్తున్న ప్రయత్నాన్ని అభీనందించారు...అప్పుడు స్వప్నతల్లి ఆచూకి దోరకలేదుకాని చాలామంది స్వప్న తన బిడ్డేమొనని వచ్చీ చూసి వేళ్ళారు.... ఈ నేపద్యంలోనే..రంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ కుటుంబం చెప్పిన ఆనవాళ్ళు పుట్టు మచ్చలు ఆన్నీస్వప్నకు సరిపోయాయి..... వాళ్ళే స్వప్న తల్లిదండ్రులని అనుకుంటున్నాము కాని డిఎన్ ఏ టెష్టు రిపొర్టు రావలసి వుంది...అది వస్తే ఓ తల్లిబిడ్డను కలిపిన ఆనందం మా జీ 24 గంటలు టీం కు మిగులుతుంది

1 comments:

 

Sample text

Sample Text

Sample Text